నందికొండ, మే 28 : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డలకు వరమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. నందికొండ పైలాన్, హిల్‌కాలనీకి చెందిన 12 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బుధవారం వారి ఇంటికి వెళ్లి మున్సిపల్ చైర్పర్సన్ కర్న అనూషారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
చెక్కుల పంపిణీకి బైక్‌పై ర్యాలీగా వెళ్తున్న ఎమ్మెల్యే మార్గమధ్యంలో వృద్ధురాలు గొడ్డేటి ఐలమ్మతో కొద్దిసేపు ముచ్చటించారు. రానున్న ఆరు నెలల్లో నాగార్జునసాగర్‌లో రోడ్లు, నీళ్లు వంటి సౌకర్యాలన్నీ పూర్తి చేస్తానని చెప్పారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ బత్తుల విజయ్‌కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ మంద రఘువీర్, కౌన్సిలర్లు ఇర్ల రామకృష్ణ, మంగ్తానాయక్, నాగశిరీశ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, పట్టణాధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, కార్యదర్శి కాటు కృష్ణ, ఏఐబీఎస్ఎస్ పట్టణాధ్యక్షుడు మోహన్‌నాయక్, నాయకులు ఆదాస్ విక్రమ్, గుజ్జుల కొండలు, రాంబాబు, అజర్, శ్రీనివాస్‌రెడ్డి, కేశవులు, ఊర శ్రీను, విజయలక్ష్మి, మాధవి పాల్గొన్నారు.