దేవరొండ, మే 28 : పేదల ఆభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారు 30 మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
నియోజకవర్గంలో భవిష్యత్‌లో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. టీఆర్ఏస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాలు, పల్లెలు పచ్చగా మారాయని చెప్పారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులు జలకళలాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, సర్పంచ్ కవితాఅనంతగిరి, బాలూనాయక్, బొడ్డుపల్లి కృష్ణ, సురేశ్, వెంకటయ్య, సోను, ఆనంతగిరి, శ్రీశైలం, నర్సింహ పాల్గొన్నారు.
తుంగతుర్తి : అభివృద్ధికి ఆకర్శితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ తెలిపారు. శనివారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో తుంగతుర్తి, గొట్టిపర్తి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు సుమారు 40 మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్శితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, తడకమళ్ల రవికుమార్, శ్రీను, ముత్తయ్య, సురేశ్, మాధవి, మల్లేశ్వరి పాల్గొన్నారు.