యాదాద్రి, మే 27 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. టీఆర్ఎస్ కార్యాలయాల్లో గులాబీ జెండాలను ఎగురవేయాలని కోరారు. నేటి నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ శాఖ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్ గౌడ్, పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్ గౌడ్, సర్పంచ్ బైరగాని చిన్నపుల్లయ్య గౌడ్, మాజీ సర్పంచ్ పల్లెపాటి బాలయ్య, రైతు బంధు సమితి డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, నాయకులు నర్సింహ, మల్లేశ్‌గౌడ్, అజ్జు, నర్సింహగౌడ్ పాల్గొన్నారు.
ఆలేరు : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై పట్టణంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్, కౌన్సిలర్లు బేతి రాములు, కందుల శ్రీకాంత్, నర్సింహులు, నాయకులు పాల్గొన్నారు.
రాజాపేట : రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గ్రామగ్రామాన పండుగలా నిర్వహించాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో జడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, సర్పంచులు గుంటి మధుసూదన్‌రెడ్డి, నాగిర్తి గోపిరెడ్డి, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్‌గౌడ్, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు పల్లె సంతోష్ గౌడ్, మదర్ డెయిరీ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ జెల్ల భిక్షపతి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి సిద్ధులు, నాయకులు రాంరెడ్డి, స్వామి, తిరుమలేశ్ పాల్గొన్నారు.