నార్కట్‌పల్లి, మే 26 : గ్రామాల సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో రూ. 25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని అన్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి, సర్పంచ్ మేడి పుష్పలతాశంకర్, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, కొండూరి శంకర్, కల్లూరి శ్రీను, వడ్డె భూపాల్ పాల్గొన్నారు.
చిట్యాల : ఏపూరు గ్రామానికి చెందిన సురివి పద్మమ్మ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి రూ.25 వేల ఆర్థికసాయం అందించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, నాయకులు కొలను వెంకటేశ్, పొన్నం లక్ష్మ య్య, పాలెం మల్లేశం, గంట శ్రీనివాస్‌రెడ్డి, తాడూరి చంద్రం ఉన్నారు.