నల్లగొండ రూరల్,ఆగస్టు 19: మోసపురిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఏ ఆశయంతో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారో..ఆ ఆశయాలకు రేవంత్‌రెడ్డి తూట్లు పొడుస్తూ రాష్ర్టాన్ని ఆధోగతి పాలు చేస్తున్నాడన్నారు. నల్లగొండ మం డలం చందనపల్లి మాజీ ఎంపీటీసీ పెద్ది ఇందిరమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ సురిగి మణెమ్మ రమేశ్‌తో పాటు మరో 200 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవా రం భూపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. భూపాల్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మంత్రి కోమటిరెడ్డి, కేసీఆర్ నాయకత్వంలో తాను సాధించిన పనులను తనవిగా చెప్పుకుంటూ శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలు చేస్తున్నారన్నారు.
ఎప్పుడో మంజూరైన ఎల్లమ్మ గుడి రామగిరి ,డీఈవో కార్యాలయం ఎదుట ఉన్న రోడ్డుకు శంకుస్థాపన చేసి, తానే మంజూరు చేయించినట్లు ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. మంత్రిగా ఉం టూ ఇలాంటి చౌకబారు ప్రచారం చేసుకోవడం తగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉం దని, అందుకే బీఆర్ఏస్లోకి పెద్ద ఎత్తున వలసలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. మొన్న దర్వేశిపు రం, నేడు చందనపల్లి నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ సురిగి మణెమ్మరమేశ్, తంతనలపల్లి శంకర్, వెంకన్న, చింత ఇంద్రయ్య, పొడిచేటి గోపాల్, ఉప్పల పాటి పవన్ కల్యాణ్, తంతనపల్లి సాల య్య, కంభపాటి సందీప్, జక్కలి రాములు , తంతనపల్లి స్వామి, సురేశ్, రవి , చిన్న, శంకర్, చంటితో పాటు 200 మందికిపై బీఆర్‌ఏస్‌లో చేరారు.
కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, బోనగిరి దేవేందర్, మాజీ ఎంపీటీసీ నారబోయిన భిక్షం, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, జిల్లా సర్పంచ్ల జేఏసీ చైర్మన్ మేకల పల్లవి అరవింద్‌రెడ్డి, మల్లెబోయిన బుచ్చిరాజు, సల్వాది సైదులు, జిల్లపల్లి రేణుక రాజు, రేకల మౌనిక, తీగల యాదయ్య, బడుపుల శంకర్, తవి టి కృష్ణ, పొగాకు ఘట్టయ్య, మాజీ సర్పంచ్‌లు గుండెబోయిన జంగయ్య, ఎలుక శ్రీనివాస్‌రెడ్డి, కోట్ల జయపాల్‌రెడ్డి, నారగోని నరసింహ, దశరథలు, నాయలు, కర్యకర్తలు పాల్గొన్నారు.