నల్లగొండ: పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యకర్తలు సమపాలన పాటించి నిగ్రహంతో ఉన్నప్పుడే సభలు విజయవంత అవుతాయని అందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేస్తేనే పార్టీ బతుకుద్దనే విషయం గుర్తుంచుకోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అన్నారు. బుధవారం స్థానిక లక్ష్మి గార్డెన్స్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పార్టీలకు ప్రాణం కార్యకర్తలేనని ఆ కార్యకర్తలు పార్టీ నిర్ణయించిన సభలకు తప్పనిసరిగా హాజరై పూర్తయ్యే వరకు ఉండి విషయాన్ని అవగతం చేసుకోని మన ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అని టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే ఉంటారనే విషయం మరోసారి వరంగల్ సభ సందర్భంగా రుజువు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిదులు, పార్టీ బాధ్యులు కార్యకర్తలను దగ్గరుండి సభలకు తీసుకొని రావటంతో పాటు సభ పూర్తయ్యే వరకు వాళ్లతోనే ఉండి క్షేమంగా ఇంటికి చేర్చాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సభకు నల్లగొండ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లి సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనపైన ఉందని అన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పార్టీ బాధ్యులు క్రమశిక్షణతో ఉండి కార్యకర్తలను సమన్వయం చేసుకోని సభకు తరలించాలని సూచించారు.
టీఆర్ఎస్ పార్టీతోనే నల్లగొండ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అందరూ కలిసి కట్టుగా ఉండి మరోసారి నల్లగొండ లో గులాబీ జెండా ఎగురవేస్తే మిగిలిన అభివృద్ధి పూర్తవుతుందని అన్నారు.ప్రతి కార్యకర్త క్షేమం కోసం తాను పని చేస్తా నని కార్యకర్తల కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తానని అన్నారు. ఈ సందర్భంగా మండల పార్టీల అధ్యక్షులతో పాటు పట్టణ అధ్యక్షులు మాట్లాడి ఎవరు ఎంతమందిని సభకు తరలిస్తామో తెలియ జేశారు.
సమావేశంలో బ్రాహ్మణ పరిషత్ సభ్యుడు చకిలం అనీల్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అబ్బగోని రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, కటికం సత్తయ్య గౌడ్, సుంకరి మల్లేశ్ గౌడ్, గోలి అమరేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మైనం శ్రీనివాస్, చీర పంకజ్‌యాదవ్, అభిమన్యు శ్రీనివాస్, పిల్లి రామరాజు, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య, మాలె శరణ్యారెడ్డి, బక్కా పిచ్చయ్య పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.