
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : దళిత బంధు పథకంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సామాన్యులు మొదలుకుని ఉద్యోగుల వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నారు. రైతు బంధు తరహాలోనే ప్రతి దళిత కుటుంబానికి అందజేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచారు. పలు చోట్ల సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. దేశంలోనే దళితజాతి అభ్యున్నతి గురించి చిత్తశుద్ధితో ఆలోచిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే అని కీర్తించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో దళిత ఉద్యోగులు సంబురాలు నిర్వహించారు. టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు పటాకులు కాల్చి మిఠాయిలు పంచారు. ‘కేసీఆర్ జిందాబాద్… దళిత బాంధవుడు కేసీఆర్‌కు కృతజ్ఞతలు’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు శ్రవణ్‌కుమార్, కిరణ్‌కుమార్ నేతృత్వంలో ఉద్యోగులు అంబేద్కర్, సీఏం కేసీఆర్‌తో కూడిన ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఇందులో పెద్ద ఎత్తున దళిత ఉద్యోగులు భాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీఓస్ నేత శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ ప్రెండ్లీ ప్రభుత్వంగా ఇప్పటికే ప్రభుత్వ, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల, సిబ్బంది సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఇటీవలే పీఆర్సీతో పాటు పలు కీలక సమస్యలకు పరిష్కారం చూపిన కేసీఆర్, తాజాగా దళిత ఉద్యోగులకు కూడా దళితబంధు అమలు చేస్తామనడం ఊహించని వరమన్నారు. దీంతో మరింత ఆర్థిక సుస్థితర సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నార్కట్‌పల్లి, ఆగస్టు 17: దళిత బంధుతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు ప్రారంభించారని తెలిపారు. పేదల జీవితాల్లో కాంతులు నింపేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలుతో రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకు చోటు ఉండదని అన్నారు. దళిత బంధు ప్రతి ఒక్కరికీ అందుతుందని, ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాలను సైతం ఎద్దేవా చేసిన ప్రతిపక్ష నాయకులు నేడు అవి విజయవంతంగా కొనసాగుతుండడంతో నోరు మూసుకున్నారని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు ఉద్యోగులకు సైతం వర్తింపజేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నటికీ మర్చిపోలేం. అట్టడుగు స్థా యిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇలాంటి పథకాలు ఆర్థికంగా చేయూత అందిస్తాయి. ప్రతి ఒక్క దళితుడినీ ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి ప్రకటనపై దళిత సంఘాల తరఫున కృతజ్ఞతలు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ, దళితుల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కేవలం పేదరికంలో మగ్గుతున్న వారికే కాకుండా ఉద్యోగులకు కూడా అమలు చేస్తామని చెప్పడం గర్వించదగ్గ విషయం. రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలనే సీఎం కేసీఆర్‌కు దళితులంతా రుణపడి ఉంటారు. దళితబంధు పథకం అన్ని రాష్ర్టాలకూ ఆదర్శం.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని సీఎం కేసీఆర్ అమలు చేయడం సంతోషకరం. దళిత బంధు పథకాన్ని ఉద్యోగులకూ అమలు చేస్తామంటూ ప్రకటించడం చరిత్రాత్మకం. ఆర్థికాభివృద్ధితోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని గ్రహించి ప్రతిష్టాత్మకంగా దళిత బంధు అమలుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవడం దేశానికే మార్గదర్శకం. ఓటు బ్యాంకుగా వాడుకునే దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు పథకానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్‌ను నవయుగ అంబేద్కర్గా భావించాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకంతో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపిన దేవుడు అయ్యారు. ఏండ్ల తరబడి వెనుకబాటుకు గురైన దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం చరిత్రాత్మకం. దళితులు కూడా ఆత్మగౌరవంతో బతుకాలని ప్రతి కుటుంబానికీ పది లక్షల రూపాయలు ప్రకటించడం ఎన్నటికీ మర్చిపోలేం. సీఎం కేసీఆర్‌కు దళితులంతా రుణపడి ఉంటారు.
దళితుల జీవితాల్లో వెలుగులు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధును దళిత జాతి యావత్తూ స్వాగతిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దళితుల జీవనం, వారి స్థితిగతుల్లో మార్పు రాలేదు. కానీ, దళిత బంధు పథకంతో ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని ఆశిస్తున్నాం. నేటికీ దళిత ఉద్యోగులు పేదరికంలోనే మగ్గుతున్నారు. నెల వారీ వేతనం మొత్తం పెరుగుతున్న ఖర్చులు, కుటుంబ పోషణకే సరిపోతుంది. ఈ తరుణంలో ఉద్యోగులకు సైతం దళిత బంధు ఇస్తామనడం చాలా సంతోషం.
కోదాడ టౌన్, ఆగస్టు 17 : ప్రభుత్వ ఉద్యోగులకు దళిత బంధు పథకం అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం కోదాడలోని టీఎన్జీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జానీమియా, ప్రదాన కార్యదర్శి శ్యామ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటారని అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ కోదాడ అధ్యక్షుడు జానకీరాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్రావు, కోశాధికారి అనంతరావు, ఎన్నికల అధికారి మర్యాద సైదులు, జిల్లా నాయకులు సైదులు, ఆకాశ్వర్మ, హజీ నాయక్, పట్టాభిరెడ్డి, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : ఉద్యోగులకు సైతం దళిత బంధు వర్తింపజేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ టీఎన్జీఓ భవన్లో డా.బీఆర్ అంబేద్కర్, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎం.శ్రవణ్‌కుమార్, దయాకర్‌రావు, జయరావు, రామచంద్రయ్య, లక్ష్మయ్య, కిరణ్ కుమార్, సైదు లు, రఫీ, సునీత, రేణుక, నాగరాజు, భానుప్రకాశ్ పాల్గొన్నారు.