e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిల్లాలు ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

హాలియా, మే15 : ఆరుగాలం కష్టపడిన పంట పండించిన రైతు కరోనా వేళ ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాగార్జునసాగర్‌ నియోజకవర్గం వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 19,86,782 బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు. మరో 10 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
50 ఐకేపీ కేంద్రాల ద్వారా
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో 50 ఐకేసీ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఇవి కాక పీఏసీఎస్‌, మార్కెట్‌ యార్డుల ద్వారా కూడ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అనుముల మండలంలో 13 ఐకేసీ సెంటర్లు, హాలియా మార్కెట్‌ యార్డు, కొత్తపల్లి సహాకార సంఘం ద్వార ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు వద్ద నుంచి 4,13,574 బస్తాల ధాన్యం కొనుగోలు చేసింది. 13 ఐకేసీసెంటర్ల ద్వార 3,01237 బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా మార్కెట్‌ యార్డు ద్వార 87500 బస్తాల ధాన్యం, కొత్తపల్లి పీఏసీఎస్‌ ద్వార 72500 బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు. తిరుమలగిరి సాగర్‌ మండలంలో 9 ఐకేపీ కేంద్రాల ద్వార రైతు వద్ద నుంచి ఇప్పటి వరకు 1,06,320 బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు. పెద్దవూర మండలంలో 1,99,620 బస్తాలధాన్యం, గుర్రంపోడు మండలంలో 5 ఐకేసీ సెంటర్లు, 3 పీఏసీఎస్‌ సబ్‌ సెంటర్లు ద్వాదా 1,58,040 బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు. ఐదు ఐకేసీ సెంటర్‌ల ద్వార 90540 బస్తాలు, పీఏసీఎస్‌ సబ్‌ సెంటర్లు ద్వార 67500 బస్తాలు కొనుగోలు చేశారు. నిడమనూరు మండలంలో మార్కెట్‌ యార్డు, 4 ఐకేపీ సెంటర్‌ల ద్వార ఇప్పటి వరకు 1,11565 బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు. త్రిపురారం మండలంలో ఇప్పటి వరకు 14 ఐకేసీ సెంటర్లు, 11 పీఏసీఎస్‌లు సబ్‌సెంటర్లు ద్వార 9,50,000 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు.
మరింత ధాన్యం కొనుగోలు
నియోజకవర్గంలో ఐకేపీ, పీఏసీఎస్‌, మార్కెట్‌ యార్డులో ఇంకా 10 లక్షల బస్తాల ధాన్యం నిల్వ ఉంది. గన్నీ బ్యాగుల కొరత, ట్రాన్స్‌పోర్టు, ఇతర సాంకేతిక కారణాల వల్ల ధాన్యం కొనుగోలు ఆసల్యమైతుంది. ఐకేపీ, పీఏసీఎస్‌, మార్కెట్‌ యార్డుల్లో కలిపి ఇంకా 10 లక్షల బస్తాల ధాన్యం నిల్వ ఉంది. కరోనా కారణంగా గన్ని బ్యాగుల కొరత ఉందని, మిల్లర్లు పేచీ పెట్టడం వలన ధాన్యం వేగవంతంగా దిగుమతి కాకపోవడం వలన ఆలస్యం అవుతుందని అధికారులు పేర్కోంటున్నారు.

పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తాం
రైతులు దీమాగా ఉండండి, రైతు పండించిన పంటలోని ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కరోనా వేళ రైతులు బయటకు తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలులో రైతులు ఎవ్వరూ ఇబ్బందిపడవద్దు, రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. రైతులు సహనంతో వ్యవహరించి అధికారులకు సహకరించండి. రైతులను ఇబ్బందికలిగే ఏ పనిని సహించేంది లేదు.

                       -నోముల భగత్‌, ఎమ్మెల్యే, నాగార్జునసాగర్‌ 
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

ట్రెండింగ్‌

Advertisement