
ఎమ్మెల్యే చిరుమర్తి, రవీంద్రకుమార్
టీఆర్ఎస్లో పలువురు చేరిక
రామన్నపేట : ప్రతి కుటుంబానికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బత్తిని మహేశ్, పులిపల్లి వీరసామి ఆధ్వర్యంలో 100మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. సర్పంచ్ ఉప్పు ప్రకాశ్, మాజీ సర్పంచ్ బత్తుల శంకరయ్య, జోగుల సత్యనారాయణ, నీల లింగయ్య, బత్తుల వెంకటేశం, నాగరాజు, మురళి, ప్రదీప్, రామలింగం, యాదయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.
దేవరకొండలో 50మంది..
దేవరకొండ : ప్రజలకు గులాబీ జెండా కొండంత అండగా ఉన్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండమల్లేపల్లి మండలంలోని చింతకుంట్ల గ్రామానికి చెందిన 50మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికీ అందుతున్నాయన్నారు. పార్టీలో చేరిన వారు సభ్యత్వం పొందాలని, ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాలకు రూ.2 లక్షల బీమా అందుతుందని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, కొండమల్లేపల్లి రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దస్రూనాయక్, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.