తిప్పర్తి, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రమని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తిప్పర్తిలో రూ.70 లక్షలతో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. అలాగే సుం దరీకరించిన తిప్పర్తి జంక్షన్‌ను ప్రారంభించారు. ఈ సం దర్భంగా సర్పంచ్ బద్దం రజితాసుధీర్ అధ్యక్షతన ఏర్పా టు చేసిన సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడు తూ మహిళలకు ఓటు హక్కు, చదువు కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు.
మనిషి అభివృద్ధికి చదువే ముఖ్యమన్నారు. అంబేదర్క్ను స్ఫూర్తిగా తీసుకొని అం దరూ చదువుకోవాలన్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మహిళలకు ఓటుహక్కు కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే మహిళా బిల్లు కోసం ప్రయత్నిస్తామన్నారు.
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు అవసరమని, దీని ద్వారా 50 శాతం సీట్లు పెరుగుతాయన్నారు. మేయర్ బుర్రి చైతన్యశ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ..అంబేద్కర్ సామాజిక న్యాయానికి ప్రతీక అన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తిగా సం క్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ వల్లనే పేద విద్యార్థులకు చదువు, రిజర్వేషన్లు వచ్చాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేశ్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ గణేశ్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఎంపీడీవో జానయ్య, తాసీల్దార్ రామకృష్ణ, ఏపీఎం సంకు హరి, ఏఈ సన్నిరాజు, పలువురు జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, మా జీ ప్రతినిధులు పాల్గొన్నారు.
నీలగిరి, ఏప్రిల్ 14: అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మర్రిగూడ బైపాస్ రోడ్డు సమీపంలోని డీఈవో కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేదర్ భవన్లో పెరిక కరణ్ జయరాజ్ ఏర్పాటు చేసిన సహ పంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సిద్ధికి కృషి చేయాలన్నారు. అయన వెంట నల్లగొండ మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు,చీరా పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ ఎంపీపీ కరీం పాష, బొజ్జ వెంకన్న మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి.. కొండూరు సత్యనారాయణ కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, దొడ్డి రమేష్, కుందూరు ప్రవీణ్ రెడ్డి, స్వాతి రాజశేఖర్, బాణోతు దీప్లా, జమాల్ ఖాద్రీ, సర్పంచ్ లు పెరుమాళ్ల వేణు, తీగల యాదయ్య, పార్టీ కనగల్ మండల అధ్యక్షుడు అయితగొని యాదయ్య, పెరిక కరణ్ జయరాజ్, పెండ్యం ధనుంజయ, మాతంగి అమర్, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, బీపంగి యాదయ్య, గంజి రాజేందర్, సీపీఎం నాయకులు హషం,వీరారెడ్డి, భాషపాక హరికృష్ణ, కత్తుల జగన్, ఠాగూర్, నరేందర్ సన్నీ, రవి, ప్రసాద్, స్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గుండాల, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చరిత్రను ముందు తరాలకు తెలియజేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మరిపడిగలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడెపు కుమార్, ఉప సర్పంచ్ చొప్పరి సోమన్న, నాయకులు తాండ్ర శోభన్‌బాబు, దుంపల శ్రీనివాస్, దుడుక ఉప్పలయ్య, శేఖర్, సింగారం ఉప్పలయ్య, విగ్రహ కమిటీ సభ్యులు పానుగంటి విజయ్, నర్సింహులు, గంగాధర్, రాజు, ప్రదీప్, సురేశ్, యాదగిరి, పరుశురాములు, సంజీవ, గోల్కొండ రవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
చండూరు, ఏప్రిల్14 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చండూరు మండలం బోడంగిపర్తిలో మంగళవారం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.అంబేద్కర్ స్ఫూర్తితో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి తాగునీరు, సాగునీరు, కరెంట్ నిరంతరాయంగా వచ్చేవన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పర్యవేక్షణా లోపం వల్ల చాల ఇం డ్లకు తాగునీళ్లు రావడం లేదన్నారు. కార్యక్రమంలో కల్లుగీత ఫైన్సాస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, చండూరు మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, సర్పంచ్ బొమ్మల సుగుణమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుర్రం మాధవీవెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షడు బొమ్మరబోయిన వెంకన్న, పార్టీ మండల అధికార ప్రతినిధి బొడ్డు సతీష్, యువజన అధ్యక్షడు ఉజ్జని అనిల్‌రావు, నాయకు లు ఎత్తపు మధుసూదన్‌రావు, మండల మాజీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, గ్రామశాఖ అధ్యక్షుడు కట్కూరి సత్తయ్య, ఉప సర్పంచ్ సరికొండ ముత్యాలు, విగ్రహ నిర్వాహకులు పందుల రాజు, బొమ్మల సురే శ్, పందుల రవి తదితరులు పాల్గొన్నారు.