నకిరేకల్, మే 3 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13 వార్డుల్లో మల్లేశ్‌ను గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు యల్లపురెడ్డి సైదిరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాచకొండ వెంకన్న, నాయకులు నడికుడి వెంకటేశ్వర్లు, అమీర్‌పాషా, దైద పరమేశ్, నల్లగొండ రాజా, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
శాలిగౌరారం : భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థ్ధి క్యామ మల్లేశ్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్ కోరారు. మండలంలోని శాలిలింగోటం, అంబారిపేట, తక్కెళ్ళపహాడ్, బైరవునిబండ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గర్తుకు ఓటు వేయాలని అభ్యర్థ్ధించారు. ఆయా కార్యక్రమాల్లో చాడ హతీశ్రెడ్డి, కట్టా వెంకట్‌రెడ్డి, గుండా శ్రీనివాస్, మామిడి సర్వయ్య, పాక యాదయ్య, దుబ్బ వెంకన్న, మామిడి రమేశ్, వేల్పుల నరేందర్, ఈదులకంటి యాదయ్య, తోట సోమయ్య, నారగోని వీరయ్య, తీగల వెంకన్న, మాగి రవి, రాచకొండ గణేశ్ పాల్గొన్నారు.