నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం ఒక్క క్రస్ట్ గేట్‌ను 5 అడుగుల మేర ఎత్తి 8100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడు దల చేస్తున్నారు. రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను పూర్తి స్థాయి లో నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజ ర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8529 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 9076 క్యూసెక్కు లు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33576 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 61481 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశ యం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 876.80 అడుగులు (172.2620 టీఎంసీ లు) ఉంది. శ్రీశైలంకు 30415 క్యూసె క్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.