హాలియా, డిశంబర్ 15 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ చేకూరిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. అనుముల మండలం మారేపల్లి గ్రామంలోని వేంకటేశ్వర ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.50 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకు ముందు ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పురాతన ఆలయాలను అభివృద్ధి పర్చడంతో పాటు వాటికి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు. మారేపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.
అంతకు ముందు ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ చైర్మన్ గడిద శ్రీకాంత్, ధర్మకర్తలు, పూజారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ ఇరిగి పెద్దులు, వైస్ ఎంపీపీ మాలే అరుణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, నాయకులు వెంపటి శంకరయ్య, ఎన్నమల్ల సత్యం, సర్పంచులు మండలి వెంకన్న యాదవ్, మజ్జిగపు వెంకట్రాంరెడ్డి, కూరాకుల రామయ్య, విజయ్, ధర్మారెడ్డి, వద్దిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, చెదురుబెల్లి రాములు, రవీందర్‌రెడ్డి, గోనె నరేందర్‌రావు, కట్ట నారాయణరెడ్డి, బిల్లకంటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
పులిమామిడి గ్రామానికి చెందిన పలువురికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్ అందించారు. కార్యక్రమంలో కొత్తపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు రామయ్య, సందీప్ పాల్గొన్నారు.