నందికొండ, నవంబర్ 9 : పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శనివారం శ్రీశైలానికి లాంచీ ట్రిప్‌ను ప్రారంభించారు. ఈ నెల 2 మొదటి ట్రిప్ విజయవంతంగా సాగడం, పర్యాటలకుల నుంచి నుండి మంచి స్పందన రావడంతో తాజాగా 110 మంది ప్రయాణికులతో ఉదయం 9 గంటలకు లాంచీ బయల్దేరి సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం చేరుకున్నది.
ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి 80 మంది ప్రయాణికులతో తిరిగి బయలుదేరి సాయంత్రానికి సాగర్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. లాంచీ ప్రయాణంలో నాగార్జునకొండ, చాకలిగట్టు, ఏళేశ్వరం గుట్ట, లింగాలగట్టు, మద్దిమడుగు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ను చూసుకుంటూ లాంచీ ప్రయాణం సాగుతుంది.