పెన్పహాడ్, జనవరి 5 : పామాయిల్ సాగు ద్వారా స్థిరమైన ఆదాయం పొందడమే కాకుండా సమీకృత వ్యవసాయానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని నాబార్డు డీడీఎం సత్యనారాయణ అన్నా రు. మండలంలోని సింగారెడ్డిపాలెం, మాచారం గ్రామాల్లో పామాయిల్ తోటలను శుక్రవారం ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు.
పామాయిల్ క్షేత్రాల్లో అంతర పంటలుగా సాగు చేసిన టమాట, మిర్చి, కంది పంటలను పరిశీలించారు. ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న బిందు సేద్యం, పామాయిల్ సాగు సబ్సిడీల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ ఉద్యాన శాఖ అధికారి కన్న జగన్, పతంజలి కంపెనీ జిల్లా మేనేజర్ హరీశ్, ఫీల్డ్ ఆఫీసర్ సుధాకర్, డ్రిప్ కంపెనీ డీసీఓలు నర్సింహ, అనిల్ గణేశ్, మల్లేశ్, ఫీల్డ్ అసిస్టెంట్లు సుధాకర్, లక్ష్మీనారాయణ, రైతులు పాల్గొన్నారు.