– రవాణా శాఖ జిల్లా ఇన్చార్జి జయప్రకాశ్ రెడ్డి స్థల పరిశీలన
కోదాడ, జనవరి 22 : కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో నెలకొన్న మోటార్ వాహనాల తనిఖీ కార్యాలయం త్వరలో కోదాడ మండలం గుడిబండ గ్రామ శివారుకు మారనున్నది. గుడిబండలో ఈ కార్యాలయానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ సూర్యనారాయణ రవాణా శాఖకు స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు రవాణా శాఖ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి జయప్రకాశ్ రెడ్డి కేటాయించిన స్థలాన్ని గురువారం పరిశీలించారు. స్థల వివరాలను కోదాడ మోటార్ వాహనాల తనిఖీ అధికారి ఎస్ కే జిలాని వివరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ఈ స్థలం అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట అధికారులు రాజా మొహమ్మద్, కె.శ్రీనివాసులు, సంపత్ గౌడ్, జి ఆర్ చరణ్ ఉన్నారు.