కట్టంగూర్, అక్టోబర్ 17 : సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసోసియేషన్) పై అందరు అవగాహన కలిగి ఉండాలని ప్రాథమిక వైద్యాధికారి వెంకటేశ్ అన్నారు. శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సీపీఆర్ చేస్తే ప్రమాదం నుంచి కాపాడగలుగుతామన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఅర్ చేసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శేఖర్, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములు, సభ్యులు కడవేరు మల్లికార్జున్, తవిడబోయిన నర్సయ్య, హరీశ్, ఉపేందర్ రెడ్డి, సీహెచ్ఓ ఎం.నర్సింహ్మరావు, హెచ్ఎం నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.