నేరేడుచర్ల, జులై 11 : మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్ రెడ్డి అన్నారు. 100 రోజుల ప్రణాలిక కార్యక్రమంలో భాగంగా 39వ రోజు శుక్రవారం మున్సిపాలిటీలోని 9వ వార్డులో తడి చెత్త – పొడ్డి చెత్త వేరుచేసే విధానం, ఎరువు తయారీ, డెంగ్యూ, మలేరియాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మురుగు కాల్వల్లో పూడిక తీయించి దోమలు వృద్ధి చెందకుండా మలాథియాన్ స్ప్రేయింగ్ చేయించారు. వాటర్ ట్యాంక్‌ల ద్వారా సరఫరా చేసే నీటికి క్లోరిన్ పరీక్షలు చేశారు. వ్యాపార సముదాయాల వివరాలను సేకరించి ట్రేడ్ లైసెన్స్ ఆన్లైన్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, వార్డు అధికారులు, ప్రజా ప్రతినిధులు, సమభావన సంఘం సభ్యులు పాల్గొన్నారు.