హాలియా, మార్చి 15 : ఇంటి పని కట్టలేదని మున్సిపల్ అధికారులు ఇంటిని సీజ్ చేసిన సంఘటన శనివారం హాలియాలో జరిగింది. మున్సిపల్ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం జాజం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రెండేండ్లుగా ఇంటి పన్ను చెల్లించలేదు. మున్సిపాలిటీకి రూ.84,750 ఆస్తిపన్ను బకాయి పడ్డాడు. ఇంటి పన్ను చెల్లించమని 15 రోజుల క్రితం ఆయనకు మున్సపల్ అధికారులు రెడ్ నోటీస్ జారీ చేశారు. తనకు మున్సిపల్ అధికారులు రెడ్ నోటీస్ జారీ చేసినా పట్టించుకోలేదు. దీంతో హాలియా మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం జాజం వెంకటేశ్వర్లు ఇంటిని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు.