నల్లగొండ జిల్లాలో 78.09 శాతం
నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గతం కంటే 1.41 శాతం తగ్గింది. బుధవారం జరిగిన పోలింగ్‌లో జిల్లా సగటు పోలింగ్ శాతం 78.09గా నమోదైంది. నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా ఒకటి రెండు చోట్ల ఘర్షణలు, మరికొన్ని చోట్ల ప్రతిపక్షాల ఆందోళనలు, ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటలకు మెజార్టీ చోట్ల ముగిసింది.
- కార్పొరేషన్లో 77.36 శాతం పోలింగ్
- అత్యధికంగా చండూరులో, అత్యల్పంగా నందికొండలో
- గతంలో కంటే 1.41శాతం తగ్గిన పోలింగ్
- రేపు ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు
- పోలింగ్ ప్రశాంతం : కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ పవార్
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి11(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గతం కంటే 1.41 శాతం తగ్గింది. బుధవారం జరిగిన పోలింగ్‌లో జిల్లా సగటు పోలింగ్ శాతం 78.09గా నమోదైంది. నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా ఒకటి రెండు చోట్ల ఘర్షణలు, మరికొన్ని చోట్ల ప్రతిపక్షాల ఆందోళనలు, ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటలకు మెజార్టీ చోట్ల ముగిసింది.
ఒకటి రెండు చోట్ల మాత్రమే పోలింగ్ గడువు ముగిశాక కూడా నిర్ణీత సమయంలో లోపల ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్ కొనసాగింది. కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ పరిస్థితిని పర్యవేక్షించారు. కాగా పోలింగ్ తొలి రెండు గంటలు, చివరి రెండు గంటలు మందకొడిగా కొనసాగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 9 గంటల వరకు జిల్లా సగటు 11.20 శాతంగా నమోదైంది. తర్వాత 11 గంటల వరకు 27.03 శాతంగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 49.79 శాతంగా, మూడు గంటల వరకు 67శాతంగా నమోదైంది.
సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగగా, తుది పోలింగ్ శాతం 78.09గా జిల్లా సగటు పోలింగ్ నమోదైంది. నల్లగొండ కార్పొరేషన్లో 77.36 శాతం పోలింగ్ కాగా మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే… అత్యధికంగా చండూరులో 91.52 శాతం నమోదు కాగా ఆ తర్వాత వరుసగా చిట్యాలలో 87.88శాతం, హాలియాలో 85.78శాతం, దేవరకొండలో 80.26శాతం, మిర్యాలగూడలో 77.44శాతం, అతి తక్కువగా నందికొండలో 59.68 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
రేపు కౌంటింగ్
ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మొదలుకానుంది. బుధవారం పోలింగ్ ముగిసాక బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించారు. రేపు ఉదయం ఇక్కడే కౌంటింగ్ చేపట్టనున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

