యాదగిరిగుట్ట, ఏప్రిల్ 27 : సీఎం కేసీఆర్ పేదల పెన్నిధి అని మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్ అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.1,00,116 ఆర్థికసాయం అందజేసి అందుకుంటున్నట్లు తెలిపారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని 12 మంది లబ్ధిదారులకు ఆమె కల్యాణలక్ష్మి చెక్కులను అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, ఆవుల మమతాసాయి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, రైతు బంధు సమితి డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, నాయకులు గుండ్లపల్లి భరత్‌గౌడ్, సీస కృష్ణగౌడ్, బబ్బూరి శ్రీధర్, బిట్టు హరీశ్, కళ్లెం స్వాతి, గడ్డం చంద్రం, గుండ్లపల్లి లింగంగౌడ్, బండ రామస్వామి, గడ్డమీది రాజాలు, బుడిగె సత్తయ్య, ఆలేటి యాదగిరి పాల్గొన్నారు.
మోటకొండూర్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు అందని గడప లేదని జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రతి అవసరానికి ఒక పథకం అమలవుతుందని పేర్కొన్నారు. తాసీల్దార్ కార్యాలయంతో పాటు కాటేపల్లి, ముత్తిరెడ్డిగూడెం, కొండాపూర్, చందేపల్లి, వర్టూరు, మాటూరు, ఇక్కుర్తి, మేడికుంటపల్లి గ్రామాల్లో 24 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీపీ ఇందిరతో కలిసి ఇంటింటికీ వెళ్లి గురువారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్, తాసీల్దార్ జ్యోతి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మంత్రి రాజు, ఆర్ఐ సునీల్, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, ఎంపీటీసీ అంజిరెడ్డి, సర్పంచ్‌లు సూదగాని సత్తెమ్మ, చామకూర అమరేందర్‌రెడ్డి, పోతిరెడ్డి స్వప్న, పన్నాల బాయమ్మ, దూదిపాల మున్ని, మమత, విజయ, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్స్ ఎర్ర మల్లేశ్, పన్నాల నవీన్‌రెడ్డి, బీఆర్ఎస్ ఆయా గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరమని ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాగినేనిపల్లి గ్రామానికి చెందిన బేతాళ కల్యాణి, అంకుశాపురం ఇంద్రజ, నమిలె మైసమ్మ, ఫక్కీర్గూడకు చెందిన బెజ్జనబోయిన కమలమ్మ, కొలిపాక అనసూయకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను గురువారం లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి అందజేశారు. సర్పంచ్ భట్కీర్ బీరప్ప, ఎంపీటీసీ బోయిని లతానర్సింహ, ఉప సర్పంచ్ జూపల్లి భరత్, బీఆర్ఎస్ మండల నాయకులు గంగదేవి మల్లేశ్, పైళ్ల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.