బీబీనగర్, జూన్ 14 : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, అన్నారు. మండలంలోని కొండమడుగు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకే ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న వసతులను విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, ప్రత్యేక శ్రద్ధతో పని చేసి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ నారాయణరెడ్డి, డీఆర్డీఓ కృష్ణన్, స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి కొండమడుగులో నిర్వహించిన పెద్దమ్మ కల్యాణ మహోత్సవానికి హాజరై పూజలు చేశారు. బీబీనగర్‌లోని పెద్ద చెరువును పరిశీలించి చెరువు అభివృద్ధిపై సమీక్షించారు.