కట్టంగూర్, ఆగస్టు 04 : తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మావతి అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం కట్టంటూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం, ఎరసానిగూడెం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలు పట్టించాలన్నారు. అప్పుడే వచ్చే ముర్రుపాలలో బలవర్థకమైన స్యూట్రీషియన్లు, ప్రోటీన్లు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అంగన్వాడీ టీచర్లు కళమ్మ, కాసర్ల నవనీత, గర్భిణులు పాల్గొన్నారు.