పెద్దఅడిశర్లపల్లి, నవంబర్ 25: తెలంగాణలో కాంగ్రెసోళ్ల ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్లీ ఆకలి చావులే అని ఎమ్మె ల్యే రమావత్ రవీంద్రకుమార్ ఎద్దేవా చేశారు. శనివారం మండలంలోని బాలాజీనగర్, మునావత్తండా, రాం పురం, దుగ్యాల, తిరుమలగిరి, మేడారం, అక్కంపల్లి, అంగడిపేట, పీఏపల్లిలో ప్రచారం నిర్వహించారు. తండాల్లో ప్రజలు ఎమ్మెల్యే ప్రచారానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాం గ్రెస ఆరు గ్యారెంటీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రజలు ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. కేసీఈఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలను ఈసీ తిప్పికొట్టిందని తెలిపారు. త్వరలో రైతులకు రైతుబంధు అందుతుందని చెప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభు త్వం పని చేస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు వచ్చేది మూడు గంటల కరెంటే అని, ఆలోచించి ఓటేయాలని కోరారు. మూడో సారి కేసీఆర్ సీఎం కాగానే మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను అమలుచేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు వడ్యరమేష్, నేనావత్ కిషన్‌నాయక్, ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి, మాజీ జడ్పీటీసీ తేరా స్పందనారెడ్డి, ముత్యంరావు, ఏడుకొండల్, శ్రీకాంత్, లచ్చిరెడ్డి, రం గారెడ్డి, భాస్కర్‌రెడ్డి, పరమేష్, నర్సింహ పాల్గొన్నారు.
గుడిపల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం గుడిపల్లి మండలానికి చెందిన శంకర్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్, గుడిపల్లి సర్పంచ్ శీలం శేఖర్‌రెడ్డి, బోయ సుధాకర్‌రెడ్డి, ఎర్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ: సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని పెద్ద్టతండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 20 కుటుంబాలు, కొండమల్లేపల్లి మండంలోని వర్దమానిగూడెం చెందిన మరో 30కుటుంబాలు బీఆర్ఎస్లోకి చేరాయి. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. బీఆర్ ఎస్ నాయకులు నర్సింహనాయక్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులున్నారు.