– వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌తో భేటీ
– హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం
– పలు సమస్యలను తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకువచ్చిన విద్యార్థులు
రామగిరి, నవంబర్ 15 : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని శనివారం సందర్శించారు. వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవితో కలిసి వీసీ తన చాంబర్లో మల్లన్నను శాలువాతో సత్కరించారు. యూనివర్సిటీ అంశాలపై చర్చించి పలు సమస్యలను ఎమ్మెల్సీకి వివరించారు. అనంతరం తీన్మార్ మల్లన్న వర్సిటీలోని హాస్టల్స్ తో పాటు పలు విభాగాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. బాయ్స్ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
అనంతరం ఆర్ట్స్ బ్లాక్ లోని మినీ సమావేశ మందిరంలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లారు. సుదీర్ఘంగా రెండు గంటల పాటు విద్యార్థులతో సమావేశమైన మల్లన్న పలు అంశాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, హాస్టల్ వార్డెన్ డాక్టర్ నీలకంఠం శేఖర్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కన్వీనర్ వట్టే జానయ్య యాదవ్, టీఆర్పీ నాయకులు పాల్గొన్నారు.

Ramagiri : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎంజీయూ సందర్శన