మునుగోడు, మే 13 : నల్లగొండ జిల్లా మునుగోడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డికి వారం రోజుల క్రితం మోకాలి శస్త్ర చికిత్స జరిగింది. విషయం తెలిసిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మంగళవారం మునుగోడు పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లి చెన్నారెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు ముచ్చపోతుల శ్రీనివాస్, జంగిలి నాగరాజు, ఆరేళ్ల సైదులు పాల్గొన్నారు.