నల్లగొండ, మార్చి 13 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు నల్లగొండ పట్టణంలో గురువారం ఘనంగా జరిగాయి. నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన సతీమణి కంచర్ల రమాదేవి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ సమక్షంలో కేక్ కట్ చేసి కవిత పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
అదేవిధంగా స్థానిక ఉమెన్స్ కళాశాలలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. క్లాక్ టవర్ సెంటర్లో ఆటో యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో బోనగిరి దేవేందర్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సింగం లక్ష్మి, స్వరూప, మామిడి పద్మ, యాట జయప్రద రెడ్డి, కొండూరు సత్యనారాయణ, బొజ్జ వెంకన్న పాల్గొన్నారు.