నకిరేకల్/ కేతేపల్లి/ చిట్యాల , డిసెంబర్ 29 : పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ పట్టణంలోని 5, 14, 15, 16 వార్డులు, కేతేపల్లి మండలం కొప్పోలు, చిట్యాల మున్సిపాలిటీలోని 5వ వార్డులో, పేరెపల్లిల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలనలో ఎమ్మెల్యే పాల్గొని దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాపాలనలో ఎవరూ ఆందోళన చెందవద్దని, అందరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
జనవరి 6 వరకు మొదటి విడుతగా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. లబ్ధిదారుల సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో నియోజకవర్గ ప్రత్యేక అధికారి కోటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, స్పెషల్ ఆఫీసర్లు విద్యాసాగర్, గౌతమ్ రాజ్, పాండునాయక్, సీఐ రాజశేఖర్, ఎస్ఐలు గోపికృష్ణ, కౌన్సిలర్లు యాసారపు లక్ష్మీవెంకన్న, గడ్డం స్వామి, వంటెపాక సోమలక్ష్మి, గర్షకోటి సైదులు, వార్డు ఇన్చార్జిలు పాల్గొన్నారు. కేతేపల్లిలో ఎంపీపీ పెరుమాళ్ల శేఖర్, తాసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్‌రెడ్డి, సర్పంచ్ చంతమళ్ల అశ్విని పాల్గొన్నారు.చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ లాజర్, మున్సిపల్ కమీషనర్ రామదుర్గారెడ్డి, కౌన్సిలర్ జడల పూలమ్మాచినమల్లయ్య, పేరెపల్లి సర్పంచు అంతటి వెంకటేశ్, కాటం వెంకటేశం, ఎద్దులపురి క్రిష్ణ పాల్గొన్నారు.
దేవరకొండ, డిసెంబర్ 29 : అర్హులందరికీ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అందజేస్తున్నదని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. ప్రజా పాలనలో భాగంగా దేవరకొండ 11వ వార్డులో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఆయన చెప్పారు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 20 వార్డుల్లో కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంచినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, కమిషనర్ వెంకటయ్య, నాయకులు పున్న వెంకటేస్వర్లు, సిరాజ్‌ఖాన్, బత్తుల అమర్, ఎండీ యూనుస్, నవీద్, కౌన్సిలర్లు గాజుల మురళి పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నిజమై పేదలకు అందేలా చూడాలని ఎమ్మెల్యే బత్తిని లక్ష్మారెడ్డి కోరారు.ప్రజా పాలనలో భాగంగా మండలంలోని తక్కెళ్లపహాడ్లో సభలో ఆయన మాట్లాడారు.ప్రజలు ఎవరు ఆందోళన చెంద వద్దని, అర్హులందరూ అవకాశం ఇచ్చిన 8 రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. కొత్త రేషన్ కార్డులు సంక్రాంతి తరువాత సంబంధిత శాఖ మంత్రి, సీఎం తో చర్చించి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, మాజీ సర్పంచ్ గుండు నరేందర్పాల్గొన్నారు.
శాలిగౌరారం : ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మండలంలోని ఉప్పలంచ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. అర్హులైన వారందరూ ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు కూడా సమాచారం ఇచ్చి వారు కూడా దరఖాస్తు చేసుకునేలా స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అంతకు ముందు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొదటి సారిగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సామేల్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, మండల ప్రత్యేకాధికారి శశిధర్‌రెడ్డి, సర్పంచ్ బండారు మల్లయ్య, ఎంపీడీఓ రేఖల లక్ష్మయ్య, కందాల సమరంరెడ్డి, అన్నెబోయిన సుధాకర్, చాడ సురేశ్‌రెడ్డి, దండ అశోక్‌రెడ్డి, నోముల జనార్దన్, భూపతి అంజయ్యగౌడ్, నిమ్మల మధు పాల్గొన్నారు.
నల్లగొండ సిటీ: కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలనను నల్లగొండ ఆర్డీఓ రవి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ 5 గ్యారంటీలు అందుతాయన్నారు. మండలంలోని లింగాలగూడెం, బాబాసాహెబ్‌గూడెంలో కూడా దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో కనగల్ ఎంపీడీఓ సోమసుందర్‌రెడ్డి, తాసీల్దార్ జ్యోతి ఎంపీఓ ముజీబుద్దీన్, ఎంపీపీ కరీం పాషా, సర్పంచులు హేమానాయక్,సుంకిరెడ్డి రమణారెడ్డి, వెంపటి ధనమ్మ బాబాసాయిగూడెం పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండలంలోని రామచంద్రపురం, పందనపల్లి గ్రామాల్లో శుక్రవారం రెండో రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, సర్పంచులు, ఎంపీటీసీలు గద్దపాటి సీతమ్మ, మాద యాదగిరి, ప్రియాంక, నలమాద వీరమ్మ, పాలడుగు హరికృష్ణ, మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ, పెద్ది సుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్, కుంభం తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.
చండూరు : పట్టణంలోని 3వ వార్డు లక్కినేనిగూడెంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆర్డీఓ దామోదర్‌రావు సందర్శించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను స్థానికంగా విచారణ జరిపి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. ఆయన వెంట తాసీల్దార్ రవీందర్‌రెడ్డి, కమిషనర్ మణి కరణ్, పర్యావరణ ఇంజినీర్ అరవింద్‌రెడ్డి, ఉన్నారు.
తిప్పర్తి :మండలంలోని మర్రిగూడ, దుప్పలపల్లి గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలో తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేనెల 6వ వరకు దరఖాస్తులు చేసుకొవచ్చని ఎవరు ఇబ్బంది పడరాదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, సర్పంచులు సతీశ్, వంటెపాక సుశీల, ప్రత్యేకాధికారి భూమన్న పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి :మండలంలోని అక్కెనపల్లి, నెమ్మాని, శేరుబాయిగూడెం, ఎల్లారెడ్డి గూడెం గ్రామాల్లో ప్రజాపాలన నిర్వహించారు. విడతలవారీగా గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. ఎంపీడీఓ యాదగిరి, తాసీల్దార్ పద్మ పాల్గొన్నారు.
తీసుకున్నారు. కార్యక్రమాల్లో తాసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ భాస్కర్‌గౌడ్, ఎంపీఓ సుమలత, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
గట్టుప్పల్ : మండలంలోని శేరుగూడెం ప్రత్యేకాధికారి, తాసీల్దార్ లావణ్య ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తులు తీసుకున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. శుక్రవారం మండలంలోని అజ్మాపురం, పుట్టంగండి, అంగడిపేట, కేశంనేనిపల్లి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు.
మాల్ : చింతపల్లి మండలం తక్కెళ్లపల్లిలో తాసీల్దార్ శంషోద్దీన్ శుక్రవారం దరఖాస్తు స్వీకరించారు. జనవరి 6 వరకు దరఖాస్తును తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు ఆయన వెంట ఆర్ఐ, పంచాయతీ కార్యదర్శి న్నారు.
చందంపేట : మండలంలోని రేకులగడ్డ, ముర్పునూతల, మానావత్తండా, ముడుదండ్ల గ్రామాల్లో తహసీల్దార్ రాములు గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించారు. మండల వ్యాప్తంగా శుక్రవారం 459 మంది దరఖాస్తు వచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు నాయక్, తాసీల్దార్ జానయ్య, ఏఈఓ ప్రవీణ్ కుమార్, సర్పంచులు లక్ష్మమ్మ, అనురాధ, లోక్యనాయక్, రామకృష్ణ, అంజయ్య, శ్రీనివాస్, వెంకటయ్య, జగన్, రవి పాల్గొన్నారు.
నేరెడుగొమ్ము మండలంలోని చిన్నమునిగల్, పెద్దమునిగల్, దాసర్లపల్లి గ్రామంలో లబ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో తాసీల్దార్ అరుణమ్మ, ఎంపీడీఓ ఝాన్సీలక్ష్మి, పాల్గొన్నారు.
నిడమనూరు : మండలంలో గుంటుక గూడెం, రాజన్నగూడెం, ఎర్రగూడెం, మారుపాక గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణను నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్ పరిశీలించారు. గుంటుక గూడెం -170, రాజన్నగూడెం -390, ఎర్రగూడెం- 190, మారుపాక-325 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, డీఎల్పీఓ ప్రతాప్ నాయక్, ఎంపీడీఓ ప్రమోద్ కుమార్, జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, అధికారులు రషీద్, బోనగిరి రమేశ్, రాధాకృష్ణ, ఎంపీఓ పి.రామలింగయ్య, ఏఈ లు వరలక్ష్మి, గ్రీష్మ, వెంకటేశం, గిర్ధావర్ శశి కుమార్, సర్పంచులు పాల్గొన్నారు.
హాలియా : హాలియా 12 వార్డుతో పాటు మండలంలోని పంటవానికుండ, నాయుడుపాలెం, పంటవానికుంటతండాలో దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమాల్లో తాసీల్దార్ జయశ్రీ, మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, ఎంపీడీఓ లక్ష్మి, కౌన్సిలర్లు చింతల చంద్రారెడ్డి, సర్పంచులు తేర మణేమ్మ, సాలీ, చంద్రకళాకిరణ్ పాల్గొన్నారు.
దామరచర్ల : మండలంలోని కల్లేపల్లి, బాలాజీనగర్, బండావత్తండా, గణేశ్‌పహాడ్‌లో అధికారులు గ్రామ సభ లు నిర్వహించారు ఏర్పాటు చేశారు. ధరఖాస్తులు నింపడంలో గ్రామస్తులు అయోమయానికి గురయ్యారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణమూర్తి, తాసీల్దార్ శంకర్‌నాయక్, అధికారులు పాల్గొని ధరఖాస్తులను స్వీకరించారు.
వేములపల్లి : మండలకేంద్రంలో ప్రజాపాలన అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జానయ్య, తాసీల్దార్ శ్రీనివాస్‌శర్మ, డీటీ నిర్మలాదేవి, ఏఓ రుషేంద్రమణి, ఏఈ చిన్నినాయక్ పాల్గొన్నారు.
పెద్దవూర : మండలంలోని బట్టుగూడెం లో ప్రజాపాలనలో దరఖాస్తులను మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె. విజయకుమారి, సర్పంచ్ చామకూరి చిన్నలింగారెడ్డి, ఎంపీటీసీ కత్తి మహలక్ష్మి, సెక్రటరీ అనిల్ పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని ఖుదాభక్ష్‌పల్లి,శివన్నగూడెం,రాజపేట తండా, తిరుగండ్లపల్లి గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, తాసీల్దార్ బి.శ్రీనివాస్, డిప్యూటీ తాసీల్దార్ తారకారామన్, ఎంపీడీఓ జె.వెంకటేశ్వర్ రావు, సర్పంచులు ఆంబోతు సుధాకర్ నాయక్, చిట్యాల సబితాయాదగిరి రెడ్డి, ఎన్.సక్కుబాయి బిచ్చునాయక్, ఐతపాక జంగయ్య, ఎంపీటీసీ తుమ్మల వరప్రసాద్, ఏపీఎం హరి,ఏపీఓ వెంకటేశం పాల్గొన్నారు.
త్రిపురారం : మండలంలోని అంజనపల్లి, లోక్యాతండా, డొంకతండా, సత్తెంపాడుతండా గ్రామాల్లో ప్రజాపాలనలో ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్రెడ్డి పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ భారతీభాస్కర్నాయక్, తాసీల్దార్ గాజుల ప్రమీల, పీఆర్ ఏఈ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ, సూపరింటెండెంట్ సత్యప్రభ, ఎంపీఓ భిక్షంరాజు, ఏపీఓ శ్యామల, సర్పంచులు అవిరెండ్ల వీరయ్య, సేవానాయక్, హన్మంతునాయక్ పాల్గొన్నారు.