కోదాడటౌన్ /హుజూర్నగర్ : జనవరి 18: ఖమ్మం బహిరంగ సభ దేశ భవిష్యత్‌కు దిశా నిర్దేశం చేస్తున్నదని ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. కోదాడలో ఖమ్మం భారీ బహిరంగ సభకు వేలాది మంది పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో ర్యాలీని నిర్వహించి తెలంగాణ తల్లికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకత్వం లోపంతో కుదేలవుతున్న దేశానికి బీఆర్ఎస్తో నాయకత్వ భరోసా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారన్నారు. నేడు దేశ యావత్తు ప్రజలు సీఎం కేసీఆర్ నాయత్వంలో నడిచేందుకు సిద్ధ్దమయ్యారన్నారు.
14 యేండ్ల పాటు తెలంగాణ కోసం పోరాడి కారణజన్ముడైన సీఎం కేసీఆర్ మరోసారి దేశం కోసం వేస్తున్న ముందడుగుకు జనం నీరాజనాలు పడుతున్నారని అన్నారు. కాగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి ఖమ్మం సభకు తరలి వెళ్తున్న వాహనాలను పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి కార్యకర్తలకు అభివాదం చేశారు. పట్టణంలోని ఆయా వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్రా సుధారాణీపుల్లారెడ్డి, ఎంపీపీ చింతా కవితారెడ్డి, మహిళా విభాగం పట్టణాధ్యక్షురాలు ఇర్ల రోజారమణి, వార్డు కౌన్సిలర్ కల్లూరి పద్మజ, నాయకులు పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్, అనంతరారపు బ్రహ్మం, వెంకట్, మౌలానా, పోటు రంగారావు, మధు పాల్గొన్నారు.