చిట్యాల, మార్చి 10 : నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని నకిరేకల్ ఎమె ్మల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని గుండ్రాంపల్లి, వెలిమినేడు, పేరెపల్లి, తాళ్లవెల్లంల, నేరడ గ్రామాల్లో ఆదివారం ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
ఎన్నికల హామీలకు కట్టుబడి వాటిని అమలు చేస్తుందని అన్నారు. సోమవారం ఇందిరమ్మ ఇళ్లను అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే వివరించారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, ఎంపీటీసీ దుబ్బ పద్మాకుమారస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాటం వెంకటేశం, గుడిపాటి లక్ష్మీనర్సింహ, అంతటి వెంకటేశం, జనగాం రవీందర్, దేశబోయిన సరస్వతి, నమ్ముల విజయ్, కొంపెల్లి వెంకట్రెడ్డి,పాల్గొన్నారు.