కట్టంగూర్, మే 07 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ పరిధి ఎస్ఎల్బీసీ కాలనీకి చెందిన మాదగోని లోకేశ్, పెద్దానిబాయి గ్రామానికి చెందిన రాచకొండ నిఖిల్ మంగళవారం శాలిగౌరారం మండలం మాదారం కలాన్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సమాచారం తెలిసిన ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానా మార్చురీలో ఉన్న ఇరువురి మృతదేహాలను సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, నాయకులు పెద్ది సుక్కయ్య, పెద్ది యాదగిరి, బెజవాడ సైదులు. ముత్యాల లింగయ్య, రవి ఉన్నారు.