డిండి, నవంబర్ 11: తెలంగాణ రాష్ట్రం తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయడం, 24గంటల కరెంట్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెసోళ్లను మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లను ఆయన సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతుందని దీమా వ్యక్తం చేశారు. ఈ సారి అధికారంలోకి రాగానే ఇప్పుడు ఇస్తున్న రైతుబంధు రూ.16వేలకు, ఆసరా పిం ఛన్లు రూ.5వేలకు పెంచడంతో పాటు ఎన్నో పథకాలు అమలు చేస్తారని హామీ ఇచ్చారు. తెల్లరేషన్ కార్డు దారులందరికి ప్రతి నెలా సన్నబియ్యం సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడులు చేస్తే సహించమని, రాష్ట్ర పొలిమేర దాకా తరిమికొడతామని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పుకో వడానికి చేసిందేమీలేక ఆ పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలు, దాడులకు పాల్పడుతు న్నారని విమర్శించారు. వారు తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని వీఏఎస్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్యనాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన విధానంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు అందుతున్న ప్రతి ఇంటిని, ప్రతి లబ్ధిదారుడిని కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జడ్పీటీసీ మాధవరం దేవేందర్‌రావు, ఎంపీపీ మాధవరం సునీతాజనార్ధన్రావు, వైస్‌ఎంపీపీ పుల్లమ్మ, బీఆర్ఎస్ నాయకులు నేనావత్ కిషన్‌నాయక్, వడిత్యా రమేష్‌నాయక్, వెంకటేశ్వర్రావు, ఎంపీటీసీ వెంకటయ్య, స్థానిక సర్పంచ్ సాయమ్మాకాశయ్య, పీఏసీఎస్ చైర్మన్లు శ్రీనివాసరావు, నాగార్జున్‌రెడ్డి, నాయకులు రాఘ వాచారి, విష్ణువర్ధన్‌రెడ్డి, భగవంతరావు, రాములు, జంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.