భూదాన్‌పోచంపల్లి, నవంబర్ 10 : కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే భవిష్యత్ అంధకారమవుతుందని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్ను గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని దేశ్ముఖి, పిలాయిపల్లి, జగత్పల్లి, పెద్దగూడెం, అలీనగర్, జూలూరు, కప్రాయపల్లి, పెద్దరావులపల్లి, గౌస్‌కొండ, రామలింగంపల్లి ఇంద్రియాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాడవాడల తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందన్నారు.
దళిత బంధు పథకం దశలవారీగా అర్హులైన వారందరికీ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ ప్రకటించినట్లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, పింఛన్లు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు సీఎం కుర్చీ కోసమే పాకులాడుతున్నారని, పదవుల కోసం కొట్లాడడం తప్ప ప్రజల కష్టసుఖాలు పట్టించుకోరని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సాంలకు నీలయమన్నారు. 3 గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్‌కు ఓటు వేస్తారా 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్కు ఓటేస్తారా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
భువనగిరి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన సీసీ, రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మరోసారి తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ రావుల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాటి సుధాకర్‌రెడ్డి, చిలువేరు బాలనరసింహ, బందారపు లక్ష్మణ్‌గౌడ్, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు సామ రవీందర్‌రెడ్డి, బత్తుల మాధవీశ్రీశైలంగౌడ్, మారెట్ డైరెక్టర్లు ముత్యాల మహిపాల్‌రెడ్డి, పగిళ్ల సుధాకర్‌రెడ్డి, సర్పంచులు దుర్గం స్వప్నానరేశ్, మన్నె పద్మారెడ్డి, అందెల హరీశ్, యాకరి రేణుకానర్సింగ్రావు, రమావత్ రాములునాయక్, ఫకీరు లావణ్యాదేవేందర్‌రెడ్డి, గోడల ప్రభాకర్, మట్ట బాలమణీసుదర్శన్, దొడ్డి అలివేలు, ఎంపీటీసీలు బందారపు సుమలత, శంకరమ్మ కిష్టయ్య, చిల్లర జంగయ్య, యాదగిరి, నాయకులు నోముల మాధవరెడ్డి, బండి కృష్ణ, పెద్దిరెడ్డి యాదగిరి, ఫకీరు సుధాకర్‌రెడ్డి, రాగీరు సత్యనారాయణ, ప్యాట చంద్రశేఖర్, రాము, కనముని కుమార్, బాల్‌రెడ్డి, అశోక్, నరసింహ పాల్గొన్నారు.