పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలి
రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె ల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని తుర్పు పూలగూడెం, చలకుర్తి, పడమర పూలగూడెం, నీమానాయక్ తండా, ఊరబావితండ, బెట్టెతండా, పూల్యతండా,
- బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్
పెద్దవూర, నవంబర్ 26: రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె ల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని తుర్పు పూలగూడెం, చలకుర్తి, పడమర పూలగూడెం, నీమానాయక్ తండా, ఊరబావితండ, బెట్టెతండా, పూల్యతండా, మల్లెవానికుంటతండా, కోమటికుంటతండా, బాసోని బావి తండా, ఎర్రకుంటతండా, జక్కలవారిగూడెం, ఊ ట్లపల్లి, గేమ్యనాయక్తండా, జగారం తండా, పులిచర్ల, కంసానిగుడెం, పోతునూరు ఎనిమిదిగూడెం, పెద్దవూర, చింతపల్లి, చింతపల్లితండా గ్రామాల్లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచర్ నాయక్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ 36 ఏండ్లు అధికారంలో ఉన్న జానారెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. దేశం తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు 24 గంటల కరెంట్ అమలు అవుతుందని తెలిపారు. కర్ణాటక మోడల్‌ను నమ్ముకుంటే కటిక చీకట్లే అని ఎద్దేవా చేశారు.

రెండున్నరేండ్లతోనే సీఎం కేసీఆర్, మం త్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఆశీర్వదిస్తే.. మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
పోడు భూములకు పట్టాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దే..
గిరిజనుల పోడు భూములకు పట్టాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటు లో ఉండే నోముల భగత్‌కుమార్‌ను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ ప్రజల మధ్యలో ఉండి పాలన సాగించలేదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెసోళ్లకు తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.
ఆలోచించి.. ఓటేయాలి
ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ అన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల ఆర్థికాభివృద్ధే ధ్యేయం గా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మూడో సారి కేసీఆర్ అధికారంలోకి రాగానే గిరిజన తండాల్లో తండాకు ఒక కమ్యూనిటీ హాల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ గుంటక వెంకట్‌రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, ప్రధాన కార్యదర్శి కర్నాటి మునిరెడ్డి, యూత్ అధ్యక్షుడు సైదులు యాదవ్, రాష్ట్ర నాయకులు గోనె విష్ణువర్ధన్‌రావు, దేవాసని శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ నియెజకవర్గ అధ్యక్షుడు షేక్ అబ్బాస్, బీఆర్ఎస్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ బషీర్, నాయకులు గజ్జెల లింగారెడ్డి, కొట్టె బాలయ్య, వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, పెండ్యాల కొండల్రావు, పెండ్యాల వెంటేశ్వరావు, ముత్యాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

