కల్యాణలక్ష్మితో పేద కుటుంబాలకు ఆసరా
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఆడపిల్లలున్న పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన 88 మందికి లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బుధవారం దేవరకొండలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
- ఎమ్మెల్యే బాలూనాయక్
కొండమల్లేపల్లి, జనవరి 17 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఆడపిల్లలున్న పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన 88 మందికి లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బుధవారం దేవరకొండలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయనున్నదని పేర్కొన్నారు. అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం అందిస్తుందని తెలిపారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఎవ్వరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీరాములు, ఎంపీపీలు దూదిపాల రేఖాశ్రీధర్రెడ్డి, నల్లగాసు జాన్ యాదవ్, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, జాల నర్సింహారెడ్డి, దూదిపాల వేణూధర్రెడ్డి, ఎంఏ సిరాజ్ఖాన్, ధనలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్లు, వివిధ మండలాల తాసీల్దార్లు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

