డిండి, మార్చి 2 : నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. శనివారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వావిల్‌కోల్ నుంచి బ్రాహ్మణపల్లి తండా వరకు ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. రూ.60 లక్షలతో కందుకూరు, రహమంతాపూర్, సింగరాజుపల్లి, తవక్లాపూర్, డిండి, గోనకోల్, ప్రతాప్‌నగర్, గోనబోయినపల్లిలో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. జేత్యతండాలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అన్ని వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జయంతిలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో తాసీల్దార్ తిరుపతయ్య, ఎంపీపీ సునీతాజనార్దన్రావు, ఎంపీటీసీ రాధిక, నాయకులు రాజేశ్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, యాదగిరిరావు, శేఖర్‌రెడ్డి, రామ్‌కిరణ్, బుచ్చిరెడ్డి, గడ్డమీది సాయి, లక్పతీనాయక్, లక్ష్మణ్, పోలా వెంకటేశ్ పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని రాంపు రం గ్రామపంచాయతీ పరిధిలోని నేనావత్ తండాలో సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అంతకుముందు తండాలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వీరమోని యల్లయ్య, నాయకులు ఏవీ రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సతీశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, బోడియానాయక్, లక్ష్మణ్‌నాయక్, నారాయణ పాల్గొన్నారు.