మిర్యాలగూడ, అక్టోబర్ 29: మిర్యాలగూడ పట్టణానికి మంగళవారం(రేపు) బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుఅన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయ ంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తుందన్నారు. అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నియోజకవర్గాన్ని రూ.2600కోట్లతో అభివృద్ధి చేశానని, మరింత అభివృద్ధి చేసేందుకు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
స్థానిక ఎన్ఎస్పీ క్యాంపు మైదానంలో మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు 80వేల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, రైతులు, వివిధ కులసంఘాలకు చెందిన నాయకులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బీఆర్ఎస్ నాయకులు నల్లమోతు సిద్దార్ధ, అన్నభీమోజు నాగార్జునచారి, మోసిన్‌అలీ, నారాయణరెడ్డి, కుర్ర విష్ణు, పెద్ది శ్రీనివాస్, పాలుట్ల బాబయ్య, మల్లయ్యయాదవ్, హాతీరాం, గోవిందరెడ్డి, పద్మావతి ఉన్నారు.
మిర్యాలగూడ: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మండలంలోని రాయినిపాలెంకి చెందిన 30కుటుంబాలు, మాడ్గులపల్లి మండలం పాములపాడుకు చెందిన 50కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే భాస్కర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పా ర్టీలో చేరినవారిలో గంధం రవీందర్, పోలగాని సురేష్, ప్రసాద్, నాగయ్య, హరీష్, మహేందర్, గుణగంటి అరవింద్, ప్రవీణ్, చంద్, నవీన్, శ్రీకృష్ణ, నరేష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు వెలిశెట్టి రామకృష్ణ, జెర్రిపోతుల రాములుగౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, చింతకాయల సైదులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్: సీఎం కేసీఆర్ రేపు మిర్యాలగూడలో ఎన్నికల ప్రచార సభను నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ నూకల సరళహన్మంతరెడ్డి తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మండలంలోని 46గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు తరలి రావాలన్నారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం
మిర్యాలగూడ: నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ఇప్పించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు స్పష్టం చేశారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు మిర్యాలగూడలోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని, మండలాల్లో పనిచేసే జర్నలిస్టులకు ఆయా మండలాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. తక్కువ స్థలం ఉంటే మల్టీ ఫ్లోర్స్ కట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు.
బీఆర్ఎస్లోకి ఆటో మెకానిక్ వర్కర్స్
మిర్యాలగూడ: పట్టణంలోని ది మిర్యాలగూడ ఆటో మెకానిక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 50 మంది ఆటో మెకానిక్స్ ఆదివారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈసందర్భంగా వారికి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్కె.ఖాజా ఆటోమెకానిక్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, టీఆర్ఎస్కేవీ పట్టణ అధ్యక్షుడు ఐల వెంకన్న, ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షుడు వాజిద్, అంజయ్య, పండుగ క్రాం తి, వర్కర్స్ యూనియన్ నియోజవర్గ ఉపాధ్యక్షుడు ఎండీ.రఫీ, ఆర్.శంకర్ తదితరులు పాల్గొన్నారు.