నల్గొండ జిల్లా : ప్రభుత్వ నిర్లక్ష్యం, స్థానిక ఎమ్మెల్యే మౌనం వల్ల రానున్న రోజుల్లో మునుగోడు ఎడారి కాబోతుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ( Koosukuntla Prabhaker Reddy ) ఆందోళన వ్యక్తం చేశారు. ఏదుళ్ళ వద్ద నీటి పంపకాల్లో అన్యాయం జరుగుతున్నా ఎమ్మెల్యే మౌనంగా ఉండడం దారుణమని పేర్కొన్నారు.
మనకు వచ్చే 0.5 టీఎంసీలకు 436 అడుగుల వద్ద రెగ్యులేటర్ ( Regulator ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నీటి పంపకాల విషయంలో ప్రభుత్వం సమతుల్యం పాటించాలని, నీళ్లు రానప్పుడు వేల కోట్లతో నిర్మించిన శివన్న గూడెం,లక్ష్మణా పురం ప్రాజెక్ట్ ల పరిస్థితి ఆగమ్యచొర్యంగా మారనుందని పేర్కొన్నారు.
మునుగోడు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మునుగోడులో ఎక్కడ కూడా ఒక్క ఎకరానికి సాగు నీరు అందలేడం లేదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలదీయకపోతే నాగార్జున సాగర్ కుడి కాల్వ, ఎడమకాల్వ విషయంలో జరిగిన అన్యాయమే ఎదురుకాబోతుందని వెల్లడించారు.
436అడుగుల వద్ద రెగ్యులేటర్ ను నెలకొల్పాలని ఎమ్మెల్యే ప్రభుత్వం వద్ద డిమాండ్ చేయాలని సూచించారు. లేని పక్షంలో తామే పోరాటాల ద్వారా సాధించుకుంటామని తెలిపారు.