కోదాడ, అక్టోబర్ 20 : ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండి సేవ చేసే నాయకుడు కావాలో.. టూరిస్టు నేతలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సూచించారు. స్థానిక గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కోదాడ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గవ్యాప్తంగా పిలిచింది తడవుగా ప్రతి కార్యకర్తను ఆదుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నందున పార్టీలకతీతంగా ప్రజలు బీఆర్ఎస్ను మూడోసారి గెలిపిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఎన్నికల పరిశీలకుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి భద్రతకు ఎన్నికల ప్రణాళిక భరోసా ఇస్తుందన్నారు. రైతుబంధు, పింఛన్ల పెంపు, 400కు గ్యాస్, జీవిత బీమా, అందరికీ సన్న బియ్యం తదితర పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ కవిత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ కోటేశ్వర్‌రావుతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ సభ్యులు, రైతుబంధు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయి
మోతె : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని సర్వారం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బూత్ కమిటీ, ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 60ఏండ్లు పాలించిన కాంగ్రెస్ అప్పుడు ఏం చేయకుండా, ప్రస్తుతం ఏదో చేస్తామని మాయమాటలు చెపుతుందని విమర్శించారు. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు 40రోజుల పాటు క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, ఆరె లింగారెడ్డి, ఏలూరు వెంకటేశ్వర్రావు, మిక్కిలినేని సతీశ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కాంపాటి వెంకన్న, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్లు ముప్పాని శ్రీధర్‌రెడ్డి, కొండపల్లి వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ పల్స్ మల్సూర్, మంజులరెడ్డి, ఎంపీటీసీ మేకల ఉపేంద్రాశ్రీనివాస్, సర్పంచులు ఇందిరాపురుషోత్తంరావు, రమేశ్, గాంధీనాయక్, గంగులు, కోటేశ్, శంకర్, సాయికృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, కారింగుల శ్రీనివాస్, దేవులనాయక్, వెంకన్న పాల్గొన్నారు.
అనంతగిరి : బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని వసంతాపురం బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుగులోతు భిక్షం శుక్రవారం మృతిచెందగా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గింజుపల్లి రమేశ్ ఉన్నారు.