నీలగిరి/ నల్లగొండ రూరల్/ నల్లగొండ సిటీ, నవంబర్ 2: నల్లగొండ నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్కు అండగా నిలువాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం వెలుగుపల్లి, కనగల్ మండలం పర్వతగిరి, నల్లగొండ పట్టణంలోని పలు వార్డులకు చెందిన సుమారు వెయ్యి కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 20 ఏండ్లుగా గోస తీసిన నల్లగొండ గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తీసుకున్న దత్తత ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దని, అభివృద్ధిని కాంక్షించే వారంతా తనను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, రంజిత్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బోనగిరి దేవేందర్, సందినేని జనార్దన్‌రావు ప్రసన్న, మాజీ ఎంపీపీ నారబోయిన భిక్షం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేపవెంకట్రెడ్డి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ తవిటి కృష్ణ, కనగల్ ఎంపీపీ కరీంపాషా, దర్వేశిపురం ఆలయ కమిటీ చైర్మన్ యాదగిరి, కనగల్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్య, సీనియర్ నాయకులు వంగాల సహదేవ్‌రెడ్డి, సర్పంచ్ చెగోని అంజమ్మ తదితరులున్నారు.
పట్టణంలో 31వ వార్డు నుంచి పుట్ట కోటయ్య ముదిరాజ్, ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట చంద్రశేఖర్, 47వ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జి సింగారపు విజయ్‌కుమార్, నాయకులు సంతోష్, కోటి, 20వ వార్డు నుంచి గోగుల యాదగిరి, బయ్య కృష్ణ, కనగల్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నీలకంఠ జగ్గయ్య, నకిరేకంటి నర్సింహ, జంపాల యాదగిరి, మామిడాల శివ, ఎస్కే మహబూబ్ జానీ, సోమమ్మ, మెండికత్తి చంద్రయ్య, నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన బీజేపీ వార్డు సభ్యుడు పోతేపాక సతీశ్, కాంగ్రెస్ నాయకులు శైలేందర్, ఓర్సు సైదులు, కె. కొండయ్య కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.