నీలగిరి, ఫిబ్రవరి 9 : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పట్టణ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చిందని, కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ప్రచారంలో చివరి రోజైన సోమవారం ఆయన నల్లగొండలోని 17, 11, 13, 6, 30, 31, 32, 33, 35 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలంటూ ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ ఇంచార్జ్ కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈసందర్భంగా అన్ని డివిజన్లలోనూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బీఆర్ఎస్కు మద్దతు పలికారు. కంచర్ల ప్రచారం చేసిన అన్ని డివిజన్లలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కార్ నడిస్తే.. నల్లగొండలో మాత్రం గుమ్ముల, బుర్రి సర్కార్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారని, వారి బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, అందరికి తాను అండగా ఉంటానని అన్నారు. తాను రూ.1500 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు నల్లగొండలో ఉన్న మీ అందరికీ కనిపిస్తున్నదని, రెండున్నర సంవత్సరాల్లో స్థానిక మంత్రి నల్లగొండ అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు.
నల్గొండ అభివృద్ధికి ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మంత్రి కోమటిరెడ్డిని ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసగించిన కాంగ్రెస్‌కు గుణ పాఠం తప్పదని భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ బీఆర్ఎస్ నాయకులు చీర పంకజ్ యాదవ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, అభ్యర్థులు మందడి లిఖితాసైదిరెడ్డి, దండెంపల్లి సుజాతాసత్తయ్య, కుందూరు దీప్తీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గున్రెడ్డి రాధికా యుగేందర్‌రెడ్డి, జహంగీర్ బాబ, మిర్యాల జ్యోతి స్వామి, బోనగిరి ఉమాదేవీ దేవేందర్, తన్నాల స్వాతీజనార్దన్, గంజి లక్ష్మి, మాజీ కౌన్సిలర్లు మిర్యాల యాదగిరి, మెరిశెట్టి నాగేశ్వర్రావు, దండెంపల్లి సత్తయ్య తదితరులు ఉన్నారు.