నిడమనూరు, జూన్ 19 : నిడమనూరు మండలంలోని బంటువారి గూడెంలో అగ్నిప్రమాదంలో పూరి గుడిసె కోల్పోయిన కటికర్ల తిరుపతమ్మ కుటుంబాన్ని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం దద్దమైన పురుగు గుడిసెను పరిశీలించి రూ. 25 వేలు ఆర్థిక సాయం అందించారు. ప్రత్యేక కోటా కింద ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సాయాన్ని త్వరగా అందేలా చూడాలని తాసీల్దార్ జంగాల కృష్ణయ్యకు సూచించారు. ఈ కార్యక్రమంలో నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, నాయకులు యడవల్లి వల్లబ్ రెడ్డి, ముంగి శివమారయ్య, నర్సింగ్ విజయ్ కుమార్, నందికొండ మట్టారెడ్డి, సర్పంచ్ గుండెబోయిన పూజ రాజు, మెరుగు శ్రీనివాస్, గుండెబోయిన శివ, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.