బీఆర్ఎస్ అభ్యర్థివైపే పట్టభద్రులు
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి టాప్ ప్లేస్‌లో ఉన్నారని, పట్టభద్రులు మూకుమ్మడిగా ఆయనకే ఓటు వేసి పట్టం కట్టబోతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో రాకేశ్‌రెడ్డికే మెజారిటీ
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, మే 27 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం-నల్లగొండ-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి టాప్ ప్లేస్‌లో ఉన్నారని, పట్టభద్రులు మూకుమ్మడిగా ఆయనకే ఓటు వేసి పట్టం కట్టబోతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 457వ పోలింగ్ బూత్‌లో 673 మంది ఓటర్లు ఉండగా ఉదయం ఎనిమిది గంటలకే ఆయన మొదటి ఓటును వినియోగించుకొని యువతకు ఆదర్శంగా నిలిచారు.
అనంతరం మీడియాతో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కొద్ది రోజులుగా జరిగిన ప్రచారాల్లో పట్టభద్రులైన ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నారని తెలిపారు. బ్లాక్ మె యిలింగ్కు పాల్పడే కాంగ్రెస్ అభ్యర్థిని, ప్రజల్లో కనిపించని బీజేపీ అభ్యర్థిని కాదనుకున్నారని చెప్పారు. ఉన్నత చదువులు చదివి సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన రాకేశ్‌రెడ్డిని గెలిపించుకునేందుకు పట్టభద్రులైన యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, పింఛన్‌దారులు పెద్దఎత్తున పోలింగ్ బూత్‌లకు వచ్చారని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని, ఓటు వేయకపోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమేనని అన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

