సూర్యాపేట రూరల్, జనవరి 3 :పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పనులకు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, తాసీల్దార్ శ్యామ్ సుందర్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, రెడ్డి, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.