చివ్వెంల, జనవరి 18 : నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్, అక్కలదేవిగూడెంలో ఇటీవల మృతిచెందిన మాజీ సర్పంచ్ రౌతు రాఘవరావు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పుట్టా సైదులు కుటుంబాలను ఆయన పరామర్శించారు.
మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జూలకంటి జీవన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రావిచెట్టు సత్యం, సర్పంచ్ పుట్టా గురువేందర్, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, ధరావత్ బాబునాయక్, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, పబ్బు సైదులు ఉన్నారు.
ఆత్మకూర్.ఎస్ : మండలంలోని దాచారం గ్రామానికి చెందిన కార్మిక సంఘం అధ్యక్షుడు అల్లి వెంకన్న అయ్యప్ప మాల ధరించి శబరిమల దర్శనానికి వెళ్లి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతదేహానికి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు మర్ల చంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూడి నరసింహారావు, బత్తుల రాజేంద్రప్రసాద్, బొల్లె జానయ్య, తంగెళ్ల మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.