కాంగ్రెస్ గెలిస్తే సూర్యాపేట భస్మమే
రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జనం విసిగిపోయారని దీంతో మళ్లీ ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా.. అని ఎదురు చూ స్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన అనంతరం అనంతరం ఆయ న మీడియాతో మాట్లాడారు.
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ: రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జనం విసిగిపోయారని దీంతో మళ్లీ ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా.. అని ఎదురు చూ స్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన అనంతరం అనంతరం ఆయ న మీడియాతో మాట్లాడారు. ఈ సారి ఉద్యమకారులు, యువతతో పాటు గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చామన్నారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు ప్రవళికా ప్రకాష్, అన్నపూర్ణతో పాటు సీనియర్లు ఎంతో మంది ఈ సారి త్యాగం చేసి కొత్తవారికి అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూసిన పట్టణ ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. 2014కు ముందు తరువాత అన్న రీతిలో సూర్యాపేట అబివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. మెడికల్ కళాశాల, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మహా ప్రస్థానం, రోడ్లు, సెంట్రల్ లైటింగ్, ట్యాంక్ బండ్, బోటింగ్, పార్కులతో ఆహ్లాదం పంచామన్నారు. రెండేళ్ల కాలంలో అన్నీ మసకబారిపోతున్నాయని తాను వేల కోట్లు తెచ్చి అభివృద్ది చేస్తే దద్దమ్మ కాంగ్రెస్ హయాంలో ముప్పై కోట్లు కూడా రాలేదన్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం తాను రూ.50 కోట్లు మంజూరు చేయించగా వచ్చిన నిధులతో పా టు పాలిటెక్నిక్ కళాశాల, స్పోర్ట్స్ స్కూల్ నిధులను వాపస్ పంపిన దుర్మార్గం కాంగ్రెస్ పార్టీదన్నారు.
ఇప్పటి వరకు సూర్యాపేటలో కాం గ్రెస్ రెండు వర్గాలుగా ఉండి దోపిడీ, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే నేడు ప్రజలు ఔను వారిద్దరు ఒక్కటయ్యారని చెబుతున్నారని మరి ఇద్దరు కలిసి గెలిస్తే సూర్యాపేట ఎలా ఉంటుందో ఊహిస్తేనే దారుణంగా ఉం దన్నారు. 48 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నారని భారీ మెజార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రామచంద్రనాయక్, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ గొపగాని వెంకటనరాయణ, పట్టణ పార్టీ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, జీడి భిక్షం, నెమ్మాది భిక్షం తదితర నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

