కట్టంగూర్, నవంబర్ 2 : సాగుకు 3 గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని అయిటిపాముల, రామచంద్రపురం గ్రామాల్లో గురువారం రాత్రి నిర్వహించిన ఇంటింటికీ ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొని ఓట్లు అభ్యర్థ్ధించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి పక్షాలకు గుణపాఠం తప్పదన్నారు.
ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ గెలుపు ఎవరు ఆపలేరన్నారు. నిత్యం అందుబాటులో ఉండే ఎమె ల్యే చిరుమర్తి లింగయ్యను మూడోసారి ముచ్చటగా గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని తెలిపారు. అయిటిపాముల లిప్ట్ పూర్తి చేసి మూడు మండలాల రైతాంగానికి సాగునీరందించడమే తన లక్ష్యమన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, చింతల సోమన్న జడ్పీటీసీ తరాల బలరాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడు కొండలు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, ఎంపీటీసీలు నలమాద వీరమ్మాసైదులు, బెల్లి మహాలక్ష్మీసుధాకర్, సర్పంచ్ సూరారపు ప్రియాంక, గ్రామశాఖ అధ్యక్షుడు చౌగోని నాగరాజు, నీలం గణేశ్ పాల్గొన్నారు.
నార్కట్పల్లి : త్వరలో జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధి నిరోధకులను ఓడించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని గోపలాయపల్లి, ఏనుగులదోరి, చౌడంపల్లి గ్రామాల్లో గురువారం విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులతో, కోలాటాల మధ్య స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని మహిళలు, యువకులు, వృద్ధులను అభ్యర్థ్ధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలతో గ్రామాల మీద పడ్డారని వారిని నమ్మవద్దని అన్నారు.
నియోజకవర్గం అభివృద్ధి జరుగాలని తాను పార్టీ మారానని ఇప్పటివరకు ఎంతో అభివృద్ధ్ది చేశారని మరోసారి ఆశీర్వదిస్తే పూర్తిగా అభివృద్ధ్ది చేసి తీరుతానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, సర్పంచులు గోసుల భద్రాచలం, మహేశ్వరం సతీశ్, దుబ్బ రవి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
నార్కట్పల్లి : మండలంలోని ఏనుగులదోరి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనవెంట ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ మహేశ్వరం సతీశ్ ఉన్నారు.