కట్టంగూర్, ఫిబ్రవరి 20 : ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయానికి పెద్దపీట వేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని దుగినవెల్లి, ముత్యాలమ్మగూడెం, మాణిక్యాలమ్మగూడెం, సవుళ్లగూడెం, బిల్లంకానిగూడెం, తుర్పాయిగూడెం గ్రామాల్లో ఎస్డీఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.75 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్లు పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డివిరుస్తున్న మోదీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదన్నారు.
ప్రశాంతంగా ఉన్న నకిరేకల్ నియోజకవర్గంలో అల్లర్లు, బెదిరింపులకు పాల్పడే వాళ్లకు స్థానం లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, తాసీల్దార్ దేశ్యానాయక్, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, సర్పంచులు వనం సైదమ్మాదుర్గయ్య, గుర్రం సైదులు, వడ్డె సైదిరెడ్డి, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, పరశురాములు, ఎంపీటీసీలు మల్లెబోయిన శ్రీలతాకృష్ణ, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, తవిడబోయిన భవాని, కోఆప్షన్ సభ్యులు జానీ పాషా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నార్కట్‌పల్లి : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 6 గురు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య క్యాంపు కార్యాలయంలోఅంద జేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ పులి సైదులు, డిప్యూటీ తాసీల్దార్ మురళి, ఆర్ఐ తరుణ్, ఎంపీటీసీ చిరుమర్తి యాదయ్య, దుబ్బాక శ్రీధర్, బొబ్బలి గిరి పాల్గొన్నారు.