చిట్యాల, నవంబర్ 1 : నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూసి మరోసారి అశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఏపూరు, గుండ్రాంపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని వివరిస్తూ మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని వివరించారు.
అనంతరం ఆయా గ్రామాల్లో జరిగిన బహిరంగ సభలలో మాట్లాడుతూ తాను నిరంతరం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలో ఏ రోజు ఎలాంటి దౌర్జన్యాలకు తావు లేకుండా అన్నివర్గాల ప్రజలు శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జీవించేలా చూస్తున్నానని అన్నా రు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ఇంత కాలం సొంత ఇంటికి దూరమైన బాధ ఉండేదని ఇప్పుడు మళ్లీ తన సొంత ఇంటికి వచ్చానని అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కొలనుసునీత, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, సర్పంచులు రత్నం పుష్ప, కక్కిరేణి బొందయ్య, మర్రి జలంధర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అవుల అయిలయ్య, రాచకొండ కిష్టయ్య, యువజన విభాగం అధ్యక్షుడు తుమ్మల నాగరాజురెడ్డి, పాలెం మల్లేశం, మోసిన్, శివశంకర్, మధు పాల్గొన్నారు.
రామన్నపేట : కాంగ్రెసోళ్ల మోస పూరిత మాటలు నమ్మొద్దు అని ఎమ్మెల్యే , బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని జనంపల్లి, ఇస్కిళ్ల, ఉత్తటూరు గ్రామాల్లో బుధవారం కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికీ వెళ్లి ఓటును అభ్యర్థ్ధించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనకు మద్దతు తెలుపుతూ ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన ర్యాలీల్లో ఆయన మాట్లాడుతూ ఐదేండ్ల కాలంలో ప్రతి గ్రామంలో కోటి రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, నక్క నరేందర్ సింగిల్‌విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, సర్పంచులు రేఖ యాదయ్య, బందెల యాదయ్య, కోళ్ల స్వామి,ఎడ్ల మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ వేమవరపు సుధీర్‌బాబు, మండల ప్రధాన కార్యదర్శి పోశబోయిన మల్లేశం, బొక్క మాధవరెడ్డి, బందెల రాములు, కోళ్ల కిషన్ పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండలంలోని అక్కలాయిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు మాగి సైదులు అనారోగ్యంతో, కట్టంగూర్కు చెందిన చిత్తలూరి వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇరువురి మృతదేహాలను బుధవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వేర్వేరుగా సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించారు.