నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల మరణించిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నకిరేకల్ మండలం మోదీనిగూడెం గ్రామానికి చెందిన పగడాల లింగరాజు ప్రమాదవశాత్తు పిడుగు పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మోదినీ గూడెం చేరుకొని లింగరాజు మృతదేహానికి పులా మాల వేసి నివాళులు అర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి 5౦ వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ముదిరెడ్డి వీరారెడ్డి ప్రమాదవశాత్తు ఇంటి మీద నుంచి పడి మరణించగా మృతిదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.